చేపలు శరీరానికి ఉత్త పొషకాల్ని అందిస్తాయి. గుండె జబ్బులను నివారించగల అద్భుత శక్తి చేపలకు ఉంటుంది
చేప నూనెకూడా మనకు ఎంతగానో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు
అసలు చేప నూనె అంటే ఏమిటి, ఎక్కడనుండి వస్తుంది అని కొందరికి సహజంగా వచ్చే అనుమానం
చేప నూనె అనేది ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుండి సేకరిస్తారు
ముఖ్యంగా సాల్మన్, వైట్ ఫిష్, హెర్రింగ్, సర్డినెస్ మరియు అన్కోవిస్ అనే చేపల నుండి ఈ చేప నూనెని తీస్తారు
చేప నూనెను వాడకంతో కలిగే పలు రకాల ప్రయోజనాలు
చేప నూనెలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు.. ఎముకలు, దంతాలను దృఢంగా ఉండేలా చేస్తాయి
చేప నూనె వాడకం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతోపాటు చర్మం కాంతివంతంగా మారుతుంది
మధుమేహం ఉన్న వారు క్రమం తప్పకుండా చేప నూనెను తీసుకుంటే వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి
పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చేప నూనె సమర్థవంతంగా పనిచేస్తుంది