ప్రకృతి అందించే సహజ సిద్ధమైన ఆహారాల్లో తేనె ముఖ్యమైనంది.

ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.

విటమిన్‌ ఎ, సిలతోపాటు క్యాల్షియం, ఇనుము లాంటి ఖనిజాలుంటాయి.

వంద గ్రాముల తేనె తీసుకుంటే దాదాపు 317 గ్రాముల శక్తి లభిస్తుంది.

తేనెలో కొవ్వులు సున్నా శాతం ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి తేనె చక్కటి ఎంపిక.

రాత్రుళ్లు నిద్రపట్టని వారు పడుకునే ముందు ఓ స్పూన్ తేనె సేవిస్తే మెదడును, శరీరాన్ని గాఢనిద్రలోకి తీసుకెళ్తుంది.

రాత్రిళ్లు తేనె తీసుకోవటం వల్ల రక్తపోటూ అదుపులో ఉంటుంది.

రాత్రి సమయంలో గ్లాసుడు నీళ్లలో చెంచా తేనె వేసుకొని తాగితే ఒత్తిడిని తగ్గించి మెదడు డిప్రెషన్‌కి గురవకుండా ఆపుతుంది.

తేనెలో శక్తిని అందించే గుణాలు మాత్రమేకాకుండా యాంటీ క్యాన్సర్‌ కారకంగానూ పనిచేస్తుంది.

తేనె ఆస్తమా లాంటి శ్వాస సంబంధ రుగ్మతలను నియంత్రిస్తుంది.