సబ్జా గింజల్లో ఉండే  ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ బరువు తగ్గించడంలో సూపర్‌గా పనిచేస్తుంది.

డయాబెటిక్ రోగులకు సబ్జా గింజలు వరమనే చెప్పాలి. రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.

సబ్జా గింజలు ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. అంతేకాకుండా గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా చెక్ పెడతాయి.

అసిడిటీ, ఛాతిలో మంటలను తగ్గించడంలో సబ్జా గింజలు కీలకపాత్ర పోషిస్తాయి.

సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు రావు. ఇంకా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

సబ్జా గింజల్లో ఐరన్, విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జట్టు కుదుళ్లు ధృడంగా, ఒత్తిగా ఉంటాయి.

సబ్జా గింజల్లో ఉండే యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు.. కండరాల నొప్పితోపాటు దగ్గు, జలుబు వంటి వ్యాధులను నియంత్రిస్తాయి.