ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

ఒక్కోసారి ఉల్లిపాయలకు మొలకలు వస్తుంటాయి. అయితే చాలామంది వీటిని కొసేస్తుంటారు.

మొలకెత్తిన ఉల్లిపాయలు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి

మొలకెత్తిన ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే, అది శరీరంలోని విటమిన్ సి లోపాన్ని తొలగిస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి మరింత మెరగవుతుంది

నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరిపడా ఫైబర్‌ తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు దూరంగా ఉంటాయి

వీటిని రోజూ తగిన మోతాదులో తీసుకుంటే దంతాలు, ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు

మొలకెత్తిన ఉల్లిపాయలను సలాడ్ రూపంలో తీసుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది

మొలకలు వచ్చిన ఉల్లి పాయల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది