సపోట బెరడు ఉడకబెట్టి కషాయం చేసి తాగితే జ్వరం తగ్గుతుంది. అధిక జ్వరాన్ని తగ్గించడంలో సపోటా డికాషన్ సహాయపడుతుంది
సపోట నొప్పి, వాపు సమస్యను కూడా తొలగిస్తుంది. సపోట గుజ్జును నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి తగ్గుతుంది
సపోట జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం సమస్యను నివారిస్తుంది. లూజ్ మోషన్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది
అధిక క్యాలరీలు ఉన్న పండ్లకు బదులుగా సపోటా షేక్ లేదా సపోట ఫ్రూట్ రోజూ తినడం వల్ల బరువు తగ్గొచ్చు
సపోటా పండులో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కంటికి మేలు చేసే ‘విటమిన్ ఎ’ సపోటాలో పుష్కలంగా లభిస్తుంది
దీనిలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి
రోజూ సపోటా తినడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్ తొలగిపోయి కాలేయం దృఢంగా మారుతుంది