దోస జాతికి చెందిన కర్బూజ దాదాపు అన్ని సీజన్లలో లభిస్తుంది
కర్బూజ తినడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు నిపుణులు
కర్బూజ రుచి కూడా మంచిగా ఉంటుంది. అందుకే చాలామంది దీనిని తినడానికి, లేదా జ్యూస్ తాగడానికి ఇష్టపడుతుంటారు
కర్బూజ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం
కర్బూజలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. దీనిని అన్ని కాలాల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి తీసుకోవచ్చు
ఇందులో తగినంత పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది
జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యలను తొలగించడానికి కర్బూజ చాలా ఉపయోగకరంగా ఉంటుంది
శరీరంలో నీటి కొరతను నివారించడానికి తప్పనిసరిగా కర్బూజ తీసుకోవాలి