వేసవి కాలంలో మామిడి పండ్లు రాజ్యమేలుతాయి

మామిడి కాయ తినడానికి విపరీతమైన ఆసక్తి చూపుతారు జనాలు

అయితే, చాలా మంది మామిడి పండులో పండునంతా తినేసి.. మామిడి కాయలోని చిప్పను పడేస్తారు

మామిడి టెంకలో బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు

అవేంటో ఒకసారి చూద్దాం

విరేచనాలు, ఇతర ఉదర సమస్యలు ఉన్నవారు.. మామిడి టెంకలను ఎండబెట్టి చూర్ణం చేసి తింటే ప్రయోజనం ఉంటుంది

గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనెతో పొడిని కలపండి. ఈ మిశ్రమం అనేక ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది

మామిడికాయ గింట పొడిని పాలలో వేసుకుని తాగడం ద్వారా కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయొచ్చు

గుండె సమస్యలను నియంత్రించడంలో మామిడి గింజలు కీలక పాత్ర పోషిస్తాయి

ఎసిడిటీ వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో మామిడి గింజలు అద్భుతంగా పని చేస్తాయి