తామర గింజలనే ‘మఖానా’ అంటారు. వీటిని ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు.
గ్లూటెన్ ఫ్రీతో పాటు ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న ఈ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతారు.
తక్కువ క్యాలరీలున్న మఖానాను డైట్‌లో చేర్చుకోవడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు
మఖానాతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి అవేంటంటే
ఇందులోని మెగ్నీషియం నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, ఆర్థరైటిస్ సమస్యలను నిరోధిస్తాయి.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. కాబట్టి మధుమేహ బాధితులకు ఇది మంచి ఆహారం.
వీటిలోని క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలు, దంతాలను బలంగా మారుస్తాయి. కీళ్ల సమస్యలతో పాటు దంత సమస్యలు తగ్గిస్తాయి
వీటిలోని క్యాల్షియం, ఐరన్ గర్భిణులకు ఎంతో సహకరిస్తాయి. వారిలో రక్తహీనత సమస్య రాకుండా చేస్తాయి.
మఖానాలోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.