స్వచ్ఛమైన మనసునీ స్నిగ్ధ సౌందర్యాన్నీ ప్రతిబింస్థాయి మల్లెలు. ఇవి వేసవి కాలంలో సందడి చేస్తాయి.

ఈ మల్లెలు.. వెన్నెలా స్వచ్ఛంగా ఉండి.ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు.. మానసిక ఆనందాన్ని కూడా ఇస్తాయి.

అయితే మల్లి పూలల్లో ఔషధాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మల్లెల పరిమళం మనసుకు ఆహ్లదాన్ని ఇస్తే..

కళ్ళమంటలు, తలనొప్పి వంటి అనేక వ్యాధులకు ఉపశమనం ఇస్తాయని అంటున్నారు.

తలనొప్పి తరచుగా వచ్చే వారికి ఈ పువ్వులను వాసనచూస్తే మంచి ఉపశమనం లభిస్తుంది

మానసికంగా ఒత్తిడికి గురవుతున్నా.. డిప్రెషన్, అతి కోపం వీటన్నిటినీ శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉంది.

స్వచ్ఛమైన తాజా మల్లెలను తల దిండు పక్కనే పెట్టుకుని నిద్రించాలి. లేదంటే దీర్ఘ శ్వాసతో సువాసనను పీల్చాలి.

ఇలా రోజుకు పదిసార్లు చేస్తే.. మంచి నిద్ర పడుతుంది. మనసు ఆహ్లాదంగా మారుతుంది.