శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా లభిస్తాయి. అలాంటి పండ్లలో జామకాయ ఒకటి

వీటిలోని పోషకాలు, విటమిన్లు మనల్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి. జామ పండును పిల్లలు, పెద్దలు ఇష్టంతో తింటారు.

జామపండులో విటమిన్ సి , లైకోపీన్ యాంటీ యాక్సీడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. రోజూ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది

జామ కాయ ఉదర సమస్యలకు దివ్య ఔషధం.. రోజూ తింటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది..  మలబద్దకం దూరమవుతుంది.

జామలోని యాంటీ యాక్సిడెంట్స్ ప్రీరాడికల్స్‌ను బయటకు పంపడంలో కీలకంగా పనిచేస్తాయి. వీటిలోని ఔషధగుణాలు కాన్సర్ కణాల వృద్దిని అడ్డుకుంటాయి.

జామపండులోని పోషకాలు ట్రైగ్లి రాయిడ్స్ చేడు కొవ్వును తగ్గించటంలో కీలకంగా పనిచేస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

జామపండులో లభించే విటమిన్ -ఎ కంటిచూపు మెరుగుపడేలా చేస్తుంది. కేటరాక్ట్ వంటి సమస్యలు పెరగకుండా అడ్డుకుంటుంది.