మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీ డైట్‌లో కచ్చితంగా మెంతి కూర ఉండేలా చేసుకోండి.
చెడు కొలెస్ట్రాలు తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది
రక్తంలోని చక్కెర (గ్లూకోజ్) నిల్వలను క్రమబద్ధీకరించడంలో మెంతి ఆకులు బాగా పనిచేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది.
విష వ్యర్థాల్ని బయటకు పంపి, చర్మంపై ముడతల్ని తొలగిస్తాయి. ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తాయి.
చిన్నగా ఉండే ఈ ఆకులు.. జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. గ్యాస్, కడుపునొప్పి, మలబద్ధకం సమస్యలకు చెక్ పెడతాయి.
మెంతి ఆకుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేయడంలో ఈ ఆకులు బాగా పనిచేస్తాయి. అలాగే లివర్ కణాలు దెబ్బ తినకుండా ఈ ఆకులు కాపాడతాయి.
అస్థియోపోరోసిస్ సమస్య వల్ల పెళుసుగా మారిన ఎముకలు తిరిగి గట్టిగా అయ్యేలా చెయ్యడంలో మెంతి ఆకులు బాగా పనిచేస్తాయని అధ్యయనాలు తేల్చాయి.
మగవారిలో సంతాన భాగ్యం కలిగించడంలో మెంతులు కొంతవరకూ ప్రయోజనం కలిగిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. వీర్య ఉత్పత్తిని ఇవి పెంచగలవని తేల్చారు.