స్ట్రాబెర్రీ తినడం వల్ల గుండె రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తోంది.
స్ట్రాబెర్రీలో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాన్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కంటి శుక్లాలను, అంధత్వాన్ని దూరం చేయడంలో క్రీయశీలక పాత్ర పోషిస్తుంది.
క్రమం తప్పుకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
స్ట్రాబెర్రీలు నిత్యం తీసుకుంటే ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
స్ట్రాబెర్రీలో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మెదడును ఒత్తిడి లేకుండా ఉంచుతాయి.
స్ట్రాబెర్రీలో పుష్కలంగా ఉండే ఫైబర్ మలబద్ధకం చికిత్సలో, జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.