సపోటా పండులో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
సపోటాను తింటే అలసట వెంటనే తగ్గుతుందని.. కొత్త ఉత్సాహం కూడా వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
సపోటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తి మెరుగుదలకు ఉపయోగపడతాయి.
సపోటా పండ్లను తరచూ తింటే దృష్టి లోపాలు కూడా దూరమవుతాయి.
రోజూ ఒక సపోటా తింటే ఊపిరితిత్తులకు ఎంతో మేలు జరుగుతుంది.
సపోటా మలబద్దక సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది.
సపోటా పండులో కొన్ని రసాయనాలు పేగు చివర ఉండే పలుచని శ్లేష్మపొర దెబ్బతినకుండా కాకుండా కాపాడతాయి.
సపోటా పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.
సపోటా పండులో చర్మ, జుట్టు సమస్యలను నివారించి, సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేసే గుణం కూడా కలిగి ఉంటుంది.
సపోటాలోని పోషకాలు శరీరంలోని హానికారకాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.