వేసవిలో దొరికే పండ్లలో గులాబీ జామకాయలు (రోజ్‌ యాపిల్‌) కూడా ఒకటి

వీటితో జ్యూసులు, స్మూతీలతోపాటు పచ్చళ్లు, వంటలు కూడా తయారు చేసుకోవచ్చు

రోజ్‌ యాపిల్‌ కెలొరీలు తక్కువగా, ఫైబర్‌ అధికంగా ఉంటుంది

వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ ఎ, బి, సిలు పుష్కలంగా లభిస్తాయి

ఈ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. గుండు పనితీరును మెరుగుపరుస్తాయి

వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి

రోజ్‌ యాపిల్‌లోని నియాసిన్‌ చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుతుంది

మధుమేహం ఉన్నవారూ కూడా ఈ పండు తినవచ్చు.. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు