లీచీలో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది.

లీచీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిజన్ లోపం వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి.

లీచీ ఎండాకాలంలో చర్మం పొడిబారడం, ఎర్రబడడం వంటి సమస్యలను నివారించడానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

లిచీ పండ్లు వృద్ధాప్య‌ఛాయ‌ల‌ను తొల‌గించ‌డ‌లో  స‌హాయ‌ప‌డ‌తాయి.

లిచీలో ఉండే విట‌మిన్ సీ.. శ‌రీరంలో నుంచి ఫ్రీరాడిక‌ల్స్‌ను బ‌య‌ట‌కు పంపిస్తుంది. స్కిన్ డ్యామేజిని నిరోధిస్తుంది.

లిచీ పండ్లలో నీటిశాతం ఎక్కువ‌గా, ఫ్యాట్ చాలా త‌క్కువ‌గా ఉండడం వల్ల బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారికి ఎంతో మేలు చేస్తుంది.

లిచీ పండ్ల‌లో మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్‌, ఐర‌న్‌, మాంగ‌నీస్‌, కాప‌ర్ వ‌ల్ల ఎముక‌లు ఆరోగ్యంగా, దృఢంగా త‌యార‌వుతాయి.

లీచీ పండు రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది.