జామపండులో విటమిన్ సి ఎక్కువగా ఉన్నందున ఇది మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

కంటి చూపుని కాడాడుతూ, కళ్ళను ఆరోగ్యంగా ఉంచేందుకు కావలసిన విటమిన్ ఏ వంటి పోషకాలు కూడా జామపండులో పుష్కలంగా ఉన్నాయి.

జామపండు తింటే కంటిశుక్లాల సమస్యను నిరోధిస్తుంది.

జామపండులోని గుణాలు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాప్తి, రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

జామపండులో ఫైబర్ ఎక్కువగా ఉన్నందున ఇది జీర్ణసంబంధిత సమస్యలకు కూడా చక్కని పరిష్కారం.

ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడంతో ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ఉపకరిస్తుంది.

జామపండులో బీపీని కంట్రోల్ చేసేందుకు కావలసిన సోడియం, పోటాషియం కూడా సమృద్ధిగా లభిస్తాయి.

జామ పండులో ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ B-9ని కలిగి ఉన్నందున గర్బిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరం.

కండరాల, నరాల నొప్పిని తగ్గించడంలో కావలసిన మెగ్నిషియం కూడా ఇందులో పుష్కలంగా ఉంది.

జామపండులో మెదడుకు రక్తప్రసరణ చేయడంలో ఉపయోగపడే విటమిన్ B3, B6 ఉన్నాయి.