ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాలలో పెరుగు కూడా ఒకటి.
పెరుగు లేనిదే భారతీయులకు రోజు గడవదు.
భోజనం చివర్లో అన్నంలో కలుపుకొని తినడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.
అయితే పెరుగును మట్టికుండలో తోడుపెట్టడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మట్టికుండలో పెరుగును తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మట్టి పాత్రలో ఉన్న కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కారణంగా పెరుగు మరింత పోషకమైనదిగా మారుతుంది.
మట్టి పాత్రల్లో తయారు చేసిన పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నందున రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బంకమట్టి పాత్రల్లో తయారు చేసిన పెరుగును మరింత రుచికరంగా ఉంది.
కుండలో పెరుగును తయారు చేయడం వల్ల ఆమ్లతను సమతుల్యంగా చేస్తుంది.
మట్టి కుండలో రంధ్రాలు పెరుగులో నీటిని గ్రహించడం వల్ల గడ్డలా తయారువుతుంది.