ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ఈ మార్పుల కారణంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఇక కీరదోసతో ఎన్నో ఉపయోగాలున్నాయి. అందరు కీరదోసకాయను సలాడ్‌గా వాడుతుంటారు.
కీరదోసలో 90 శాతం నీరే ఉంటుంది. దాంతో పాటు ఖనిజలవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
అందుకే ఒంట్లో నీటిపాళ్లు తగ్గి డీ-హైడ్రేషన్‌కు గురైనప్పుడు వాటిని తక్షణ భర్తీ చేయడానికి కీరదోస ముక్కలు తినడం శ్రేయస్కారం.
కీరదోసలో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
కీరదోసలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని చ క్ఎరను ఆలస్యంగా, నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తుంది.
కీరదోసలో మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చర్మ సౌందర్యం కోసం కూడా వాడుతుంటారు.
కీరదోసలోని యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ముఖ్యంగా ఇది మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌లను, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుంది.