కొత్తిమీర ఆహారం రుచిని రెట్టింపు చేయడమే కాక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
కొత్తిమీరలోని యాంటీ బయోటిక్ మూలకాలు రక్తంలోని చెక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపున తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
లినోలిక్, ఒలిక్, పాలిమిటిక్, స్టియారిక్, ఆస్కార్బిక్ యాసిడ్స్ వంటివి కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి.
ఇవి గుండె సంబంధ సమస్యలు, హార్ట్ స్ట్రోక్‌ల వంటి హృదయ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి.
ప్రతి రోజు కొత్తిమీర తినడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
కొత్తిమీరలో లినోలాల్ అనే మూలకం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషించి, జీర్ణసమస్యలను దరిచేరనివ్వదు.
తరచు కొత్తిమీర చట్నీ తింటు ఉండటం వల్ల లేదా ధనియాల పొడిలో కొద్దిగా తేనె వేసుకుని తీసుకుంటుండటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది.
కొత్తిమీర డైయూరిటిక్‌గా పనిచేస్తుంది. శరీరంలో సోడియంను బయటకు పంపి రక్తపోటును తగ్గించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.
కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్‌ఐని కూడా తగ్గిస్తుంది.