వెజిటబుల్ రైస్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరల్లో ఎక్కువగా ఉపయోగించే క్యాప్సికమ్ రుచికే కాక మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది
క్యాప్సికమ్‌లో ఐరన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది
క్యాప్సికమ్‌లోని విటమిన్ బి6, మెగ్నీషియం, సోడియం విటమిన్లు నరాల పనితీరుకు మేలు చేస్తాయి
క్యాప్సికమ్‌లో వున్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలు కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తాయి
క్యాప్సికమ్‌లో చాలా ఎక్కువగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది
క్యాప్సికమ్‌లో ఉండే మాంగనీస్.. ఎముక మృదులాస్థి, ఎముక కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది
ఆరోగ్యకరమైన, అందమైన కేశాల కోసం క్యాప్సికమ్ తింటే మంచిదని నిపుణులు చెపుతారు
క్యాప్సికమ్ అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు కనుక మితంగా తీసుకోవాలి