దుంపకూరల్లో ఒకటి ముల్లంగి. దీనిని తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు.
ముల్లంగిని ఊరగాయ, చట్నీ, సలాడ్, పరాటా, కూరల రూపంలో తీసుకుంటారు.
సర్వసాధారణంగా అందరూ ఉపయోగించేది తెల్ల రంగులో ఉండే ముల్లంగి మాత్రమే.
అయితే నల్ల ముల్లంగి కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంది.
అంతేకాదు తెల్ల ముల్లంగిలో కంటే నల్ల ముల్లంగిలో ఎక్కువ విటమిన్లు, పోషకాలు లభిస్తాయి.
నల్ల ముల్లంగి చూడడానికి బయటకి నల్లగా ఉన్న కట్ చేస్తే లోపల అది తెల్ల ముల్లంగిలా ఉంటుంది.
నల్ల ముల్లంగి చూడడానికి బయటకి నల్లగా ఉన్న కట్ చేస్తే లోపల అది తెల్ల ముల్లంగిలా ఉంటుంది.
నల్ల ముల్లంగి తినడం వల్ల శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది. దీనిని ఆయుర్వేద ఔషధంలో ఉపయోగిస్తారు.
నల్ల ముల్లంగి తినడం వలన శరీరాన్ని ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
నల్ల ముల్లంగిని తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది.