ఇంట్లో ఏ పూజ జరిగినా పూలు, పండ్లతో పాటు ముఖ్యంగా కనిపించేవి తమలపాకులే..
ఇవి కేవలం పూజలకు మాత్రమే కాదు.. అనేకానేక ఆరోగ్య సమస్యలకు సైతం సంజీవనిగా కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు
రోజుకు రెండు తమలపాకులు నమలితే చాలు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయట
నోటి పూత, నోటి దుర్వాసన తమలపాకు నమలడం ద్వారా తగ్గుతుంది. చిగుళ్లకు మేలుచేస్తుంది
శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది
తమలపాకు రసాన్ని గొంతు భాగంలో రుద్దితే గొంతు మంట, ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉంటే తగ్గుతుంది
గాయాలు వేధిస్తున్నట్లయితే తమలపాకులను నూరి, ఆ రసాన్ని వాటిపై రాస్తే త్వరగా మానిపోతాయి
కాన్సర్ నిరోధక కారకంగానూ తమలపాకు పనిచేస్తుంది