ఉదయాన్నే మంచి నీరు తాగడం చాలా మందికి అలవాటు.

కానీ బ్రష్ చేసిన తర్వాత కాకుండా.. చేయకుండా మంచి నీరు తాగితే.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

నీరు ఎక్కువగా తాగితే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. చాలా మంది సెలబ్రిటీల బ్యూటీ సీక్రెట్ కూడా ఇదే.

 బ్రష్ చేసేకంటే ముందు నీరు తాగితే.. నోటిలోని లాలాజలం కడుపులోనికి వెళ్లి.. హానికారక బ్యాక్టీరియాను చంపుతుంది.

ప్రతి రోజూ ఉదయం బ్రష్ చేయకుండా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మీ శరీరం డిటాక్స్ అవుతుంది.

ఉదయాన్నే బ్రష్ చేయకుండా మంచి నీరు త్రాగడం ద్వారా మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

శరీరంలోని టాక్సిన్స్ విడుదల చేయడం ద్వారా మొటిమల సమస్యను అధిగమించవచ్చు. ఇలా చేస్తే ముఖంలో మెరుపు వస్తుంది.