ఉదయం వేళల్లో చాలా మందికి టీ, కాఫీలు లేదా చల్లని నీటిని తాగే అలవాటు ఉంటుంది

వీటికి ప్రత్యామ్నాయంగా వేడి నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు

వేడి నీటిలో కాస్త తేనెను యాడ్ చేసుకుంటే రుచితో పాటు మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు

కాలకృత్యాలు తీర్చుకోడానికి ముందే  2 లేదా 3 గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగాలి. ఒకేసారి వేగంగా తాగేయకుండా గుటకలు వేస్తూ తాగాలి

ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు బరువు కంట్రోల్ లో ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చాలామంది బరువు తగ్గడానికి వేడి నీళ్లు తాగుతారు

వేడినీరు తాగడం వలన అజీర్థి సమస్యలు తొలగిపోవడమే కాక జీర్ణశక్తి మెరుగుపడుతుంది

ఉబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు వేడి నీరు తాగడం చాలా మంచిది