కొత్తిమీర టీలో ఐరన్ పుష్కలంగా ఉన్నందున ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కొత్తిమీరలోని ఫోలిక్ యాసిడ్.. హోమోసిస్టీన్ ప్రభావాలను నివారించడం ద్వారా రక్త నాళాల నిర్వహణకు సహాయపడుతుంది.
హోమోసిస్టీన్ రక్త నాళాలను దెబ్బతీసి, గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కొత్తిమీర టీ సహాయపడుతుంది.
విటమిన్ సీ, ఏ లను కలిగి ఉన్న కొత్తిమీర టీ.. రక్తంలో ల్యూకోసైట్లు ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది.
కొత్తిమీరలో ఉన్న విటమిన్ కె శరీరంలో ఆస్టియోబ్లాస్ట్ చర్యను పెంచి ఎముకల నిర్మాణంలో సహాయపడుతుంది.
ఎముకల సాంద్రతను పెంచే అనేక ప్రొటీన్‌లను యాక్టివేట్ చేసేందుకు కూడా కొత్తిమీర పనిచేస్తుంది.
కొత్తిమీర టీ రొమ్ము క్యాన్సర్‌లో క్యాన్సర్ కణాల విస్తరణను తగ్గుముఖం పట్టించేందుకు సహాయపడుతుంది.