రోజూ బీట్‌రూట్, దానిమ్మ కలిపి జ్యూస్  తాగితే ఈ వ్యాధులకు చెక్..

దానిమ్మ, బీట్‌రూట్ జూస్ నిత్యం తాగడం వల్ల..శరీరంలో రక్తం పెరిగి రక్తహీనత వంటి వ్యాధులు నయమవుతాయి.

రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి రసం తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

బీట్‌రూట్, దానిమ్మతో చేసిన జ్యూస్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. గుండె రోగాలు తగ్గిపోతాయి

ఈ జ్యూస్‌లో ఉండే పోషకాలు నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు చురుగ్గా ఉంటుంది

 ఈ జ్యూస్ తాగడం వల్ల అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా తగ్గిపోతాయి.

ఈ జ్యూస్ తాగడం వల్ల అలసట కూడా దూరమవుతుంది. ఉత్తేజంగా ఉంటారు.

బీట్‌రూట్, దానిమ్మ జ్యూస్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక చర్మ సమస్యలు దూరమవుతాయి. ముఖం మరింత కాంతివంతమవుతుంది.