రెడ్ వైన్‌లో ఉండే పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

రెడ్ వైన్‌లో రోగనిరోధక శక్తిని పెంచే రెస్వెరాట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

రెడ్ వైన్‌ కడుపులో మంటను తగ్గించడంలో, ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

రెడ్ వైన్‌లో ఉండే పిసిటానాల్ అనే సమ్మేళనం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

రెడ్ వైన్‌ మొటిమలను తగ్గించడంలో, చర్మం రంగును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

రెడ్ వైన్‌లోని రెస్వెరాట్రాల్ అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

రెడ్ వైన్ వినియోగం పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

రెడ్ వైన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

రెడ్ వైన్‌ను పరిమితంగా తీసుకుంటే దీర్ఘకాల జీవితకాలంతో పాటు అకాల మరణాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.