సాధారణంగా వంట రుచి పెంచడంలో కరివేపాకు ఎక్కువగా ఉపయోగిస్తారు

ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో కరివేపాకు ఉండాల్సిందే

చాలా మంది కరివేపాకును తినడానికి ఇష్టపడరు

కానీ ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది

కరివేపాకు జీర్ణ క్రియను మెరుగు పరచడమే కాకుండా.. కడుపు సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది

కరివేపాకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి కండరాలు దృఢంగా మారుతాయి

దీంతో చేసే నూనెలు జుట్టు, చర్మం, నోటికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది

రక్తహీనతతో బాధపడేవారు కరివేపాకును తీసుకోవడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది