జీలకర్రలో పలు ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి
ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య, తలనొప్పి, వికారం లేదా ఇతర జీర్ణ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తాయి
జీలకర్రను రాత్రి నానబెట్టి, ఉదయం అదే నీటిలో ఎక్కువ నీరు కలుపుకుని టీలాగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఇది ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది
జీలకర్రను నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు దూరమవుతాయి
జీలకర్రలో ఉండే విటమిన్-ఇ చర్మం ఆరోగ్యానికి సహకరిస్తుంది
ఈ నీటిని తాగితే ముఖంపై ముడతలు పోతాయి. అలాగే మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతాయి
రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు బాధించవు
ఇక ఇందులోని లక్షణాలు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి