వీటిల్లో 96% వరకు నీరే ఉంటుంది. అందువల్ల ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూస్తాయి.

అజీర్ణం, మోకాళ్ల నొప్పులు తగ్గటానికి కిడ్నీలు, మెదడు సరిగా పని చేయటానికీ నీరు ఉపయోగపడుతుంది. శరీరంలో ఉష్ణోగ్రతలనూ నియంత్రిస్తుంది.

 ఎముక సాంద్రత తగ్గితే విరిగే ముప్పు పెరుగుతుంది. దీన్ని తగ్గించుకోవటానికి దోసకాయ ఉపయోగపడుతుంది.

దోసకాయలోని నీరు జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఆహారం విచ్ఛిన్నం కావటానికి, పోషకాలను శరీరం గ్రహించుకోవటానికి తోడ్పడుతుంది.

కేలరీలు, పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉండటం వల్ల దోసకాయ బరువు అదుపులో ఉండటానికీ తోడ్పడుతుంది.

దోసకాయల్లో కుకుర్‌బిటాసిన్‌ బి (సీయూబీ) అనే వృక్ష రసాయనం దండిగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందకుండానే కాదు, క్యాన్సర్‌ కణాల నిర్మూలనకూ ఉపయోగపడుతుంది.

సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. పొటాషియం దీని ప్రభావాన్ని తగ్గిస్తూ రక్తపోటు పెరగకుండా చూస్తుంది.