చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలను తగ్గించుకోవడానికి హాస్పటల్లకు వెళ్లే వారు కూడా ఉన్నారు.

కానీ వీటిని తగ్గించుకోవడానికి మీరు హాస్పటల్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అయినా చిన్న చిన్న సమస్యకు కూడా మందులు వాడితే మీ శరీరం దెబ్బతింటుంది.

లవంగాల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దగ్గును తగ్గించడంలో లవంగం ఎఫెక్టీవ్‌ గా పనిచేస్తుంది.

రాత్రి ఉప్పు కలిపిన లవంగాన్ని తీసుకుని బాగా నమిలితే గొంతునొప్పి తొందరగా తగ్గుతుంది..,

లవంగం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి కూడా ,పొడి దగ్గు లేదా నిరంతరం దగ్గుతో బాధపడుతుంటే.

ఈ చిట్కాలను తప్పకుందా ప్రయత్నించండి. లవంగం మొగ్గ శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది.

అంతేకాదు ఇది రోగనిరోధక క్షణాలను పెంచుతుంది. ఇది శరీరం సహజ పనితీరుకు హానిని, అసౌకర్యాన్ని కలిగించే వాటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండే ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. లవంగాలు ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటాయి.

ఇవి నోటి దుర్వాసనను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. టూత్‌ పేస్ట్‌ తయారీలో లవంగాన్ని ప్రధాన పదార్థంగా వాడుతారు.