వంకాయలో ఫైటోన్యూట్రియెంట్స్, విటమిన్ సి, ఫైబర్ వంటి లెక్కలేనన్ని పోషకాలు ఉన్నాయి.
వంకాయలోని ఫైటో-న్యూట్రీషియన్స్ మన మెదడు పనితీరును పెంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉండటానికి సహాయపడతాయి.
వంకాయలో ఐరన్ ,క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు అనేక సమస్యల నుండి కణాలను రక్షిస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
వంకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది.
వంకాయ తినడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. గుండె జబ్బుల సమస్యలను నివారిస్తుంది.
వంకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
నిద్రలేమి ,ఇతర నిద్ర రుగ్మతలను నయం చేయడానికి వంకాయను తినవచ్చని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు.