నల్ల బియ్యం శాఖాహారులకు మంచి ప్రోటీన్లను ఇచ్చే ఆహారం. అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి

నల్ల బియ్యంలో విటమిన్ బి, ఇ, నియాసిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలలో తేలింది

వీటిలో  ఆంథోసైనిన్స్  అధికంగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హానికర బ్యాక్టీరియా వైరస్  శరీరంలోకి చేరకుండా చేస్తుంది

ఈ బియ్యంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మధుమేహాన్ని  తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి

నల్ల ధాన్యాలు మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. అందుకనే ఎక్కువగా తీపి వంటలు చేయాడనికి నల్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు

ఈ బియ్యం ను మన డైట్ లో భాగంగా చేసుకోవడం వలన శరీరంలోని అనవసర కొవ్వును కరిగిస్తుంది. గుండె వ్యాధులనుంచి రక్షిస్తుంది

నల్లబియ్యంలో యాంటీఆక్సిడెంట్ల అధికం ఇవి ఆంథోసయనిన్‌ హృదయ, మెదడు సంబంధ సమస్యలను దరికి చేరనీయదు

బ్లాక్ రైస్ లో ఉండే ఫైబర్‌ జీర్ణసంబంధ సమస్యలను నివారిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవాళ్లకీ మంచి ప్రత్యామ్నాయరైస్ నల్ల బియ్యం