అల్లం చేదుగా ఉన్నా.. నిజానికి ఆ చేదే మనకు మేలు చేస్తుంది.
గర్భిణీలకు అల్లం మేలు చేస్తుంది. వారికి తరచూ ఉదయం వేళ వికారంగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వారు అల్లం వాడితే.. ఈ సమస్య తొలగిపోతుంది.
చలికాలంలో పెద్దవాళ్లకు కండరాల నొప్పులు తరచూ వస్తుంటాయి. వారంతా అల్లం తింటూ ఉంటే.. వారిలో కచ్చితమైన మార్పు వస్తుంది.
గ్యాస్, ఏసీడీటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం ఇలా చాలా సమస్యలొస్తాయి. వీటన్నింటికీ చక్కని పరిష్కారం అల్లాన్ని రోడూ వాడటమే. మూత్ర విసర్జన చక్కగా అయ్యేలా చేస్తుంది.
పీడియడ్ నొప్పులను అల్లం బాగా తగ్గిస్తుంది. పీరియడ్‌తో సంబంధం లేకుండా.. రోజూ అల్లాన్ని వాడితే.. నొప్పి సమస్య చాలావరకు తీరిపోతుంది.
రక్తంలోని ట్రైగ్లిసెరైడ్స్‌ని తగ్గించడం ద్వారా.. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది అల్లం. నెలపాటూ రోజూ వాడితే మంచి ఫలితాలుంటాయి.
రోజూ అల్లం వాడేవారికి జలుబు, దగ్గు, గొంతులో కరగర, కఫం, పొడి దగ్గు ఇలా చాలా వరకూ నయం అయిపోతాయి.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నా అల్లంని రోజూ 4 గ్రాముల కంటే ఎక్కువగా మాత్రం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీలైతే.. రోజుకు 1 గ్రాము మాత్రమే తీసుకోవాలి.