కొంతమంది బంగాళాదుంపలను తినడం మంచిది కాదు అని అంటుంటారు. కానీ బంగాళాదుంపల మన ఆరోగ్యానికి ఎలాంటి చెడు చేయదట..

యునైటెడ్ స్టేట్స్‌లోని బోస్టన్ విశ్వవిద్యాలయంలోని జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్ పరిశోధకులు ఈ విషయాన్ని చెప్తున్నారు.

నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల తెల్ల బంగాళాదుంపలను తినడం వల్ల మన శరీరానికి ఎటువంటి హాని జరగదని పరిశోధనలో తేలింది.

ఇది రక్తపోటు, డైస్లిపిడెమియా వంటి ఆరోగ్య సమస్యలతో నేరుగా సంబంధం కలిగి ఉండదు.

అదనంగా, వేయించిన బంగాళాదుంపలను తినేవారు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం కూడా తక్కువేనట.

అయితే  రెడ్ మీట్‌కు బదులుగా బంగాళాదుంపలను తినడం వల్ల ఈ ప్రమాదం తగ్గుతుందని కనుగొనబడింది.

అలా చేయడం ద్వారా  టైప్ -2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేసే అవకాశం 24 శాతం తక్కువగా ఉంటుంది అలాగే ట్రైగ్లిజరైడ్‌లను పెంచే అవకాశం 26 శాతం తక్కువగా ఉంటుందట