పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ - ‘సాహో’ సుజిత్‌  కాంబోలో ఓ మూవీ రానున్న సంగతి  తెలిసిందే

OG (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) అనే టైటిల్ తో ఈ చిత్రం ప్రచారంలో ఉంది

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది

ఈ చిత్ర ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది

ఈ కార్యక్రమానికి పవన్‌కల్యాణ్‌ తోపాటు టాలీవుడ్‌ నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌, అల్లు అరవింద్‌, దిల్‌రాజు, రచయిత కోన వెంకట్‌ తదితరులు పాల్గున్నారు

ఈ కార్యక్రమానికి హాజరై ఈ సినీ ప్రముఖులు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు

త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ మొదలు కానున్న ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ కూడా బయటకు వచ్చింది

త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ మొదలు కానున్న ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ కూడా బయటకు వచ్చింది

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా  తమన్‌ స్వరాలు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్

సుజిత్‌తో దిగిన ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘‘మేము మొదలుపెట్టేశాం’’ అని తమన్‌ పేర్కొన్నారు

‘వకీల్‌సాబ్‌’, ‘భీమ్లానాయక్‌’ తర్వాత తమన్‌ మూడోసారి పవన్‌ తో కలిసి పనిచేస్తున్నారు