ఆర్‌ఆర్‌ఆర్‌ భారీ విజయంతో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఎక్కడికి వెళ్లినా వారికి జేజేలు పలుకుతున్నారు

అయితే తాజాగా రామ్‌చరణ్‌ లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తి కార విషయం వెల్లడించారు

'రాజమౌళి నా గురువు, ఆయన్ను కలిసి ప్రతిసారి ఎంతో విజ్ఞానాన్ని అందించారు

ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు అవుతుండటంతో సినిమాలకు కొంత విరామం ఇద్దామనుకున్నాను

కొత్తగా ఏదైనా నేర్చుకుని తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టాలని గతంలో అనుకున్నాను

ఆ సమయంలో రాజమౌళి నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ ఆఫర్‌ రావడంతో ఆ ఆలోచనలను విరమించుకున్నాను' అని అన్నారు రామ్‌చరణ్‌

కాగా జక్కన్నరూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే

ఇటీవలే నాటు నాటు పాటుకు గాను ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో కూడా ఉంది