ఇంట్లో తయారు చేసిన ఈ ఫేస్ స్క్రబ్లను ఎప్పుడైనా ట్రై చేశారా
మార్కెట్లో దొరికే ఫేస్ స్క్రబ్లు చర్మానికి హాని కలిగిస్తాయి.
ఇంట్లో దొరికే పదార్ధాలతో తయారు చేసిన స్క్రబ్లతో అందం, ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు.
పంచదార గ్రైండ్ చేసి అందులో కాఫీ కలిపి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, గోరువెచ్చని నీటితో కడగేస్తే సరి
ఓట్స్-షుగర్ స్క్రబ్లో తేనె, రోజ్ వాటర్లను కూడా జోడించవచ్చు. ఓట్స్ చర్మాన్ని శుభ్రపరిస్తే, తేనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
ముందుగా పసుపును చర్మానికి అప్లై చేసి, ఆ తర్వాత పొడి చక్కెరతో స్క్రబ్ చేసుకుంటే మచ్చలేని అందం మీ సొంతం.
బాదం ఆయిల్ - షుగర్ స్క్రబ్లను ఉపయోగించవచ్చు. బాదం నూనెలో ఉండే విటమిన్ ఈ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.