సమంత హీరోయిన్ గా విజయ్‌ దేవరకొండ హీరోగా తెరెక్కుతున్న చిత్రం ఖుషి

మజిలీ డైరెక్టర్‌ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నారు

కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా తెరెక్కుతున్న ఈ  చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి

ఇప్పటికే ఈ చిత్రం కొంతభాగం షూటింగ్‌ కూడా పూర్తయ్యింది

కానీ సడెన్‌గా సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్‌కు కొన్నాళ్ళు బ్రేక్‌ పడింది

అయితే ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ రావడం లేదు

దీంతో తన పాత్రకు తగిన స్క్రీన్‌ స్పేస్‌ కేటాయించకపోవడంతో సామ్‌ కూడా ఈ సినిమాకి డేట్స్‌ ఇవ్వట్లేదని అందుకే ఈ సినిమా ఆగిపోయిందనే టాక్‌నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది

ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ శివ నిర్వాణ ట్వీట్‌ లో  ఖుషి  రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది అని వెల్లడించారు

దీంతో సినిమాపై వస్తున్న ఈ రూమర్స్‌కి ఫుల్‌స్టాప్‌ పడింది