ఇప్పటివరకు సౌత్‏లో అభిమానులను సంపాదించుకుని ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అనుపమ 

దక్షిణాదిలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది

ఇక ఇప్పుడు ఉత్తరాదిలోనూ ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ పెరిగిపోయింది

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సరసన అనుపమ నటించిన చిత్రం కార్తికేయ 2. ఈమూవీ పాన్ ఇండియా లెవల్లో భారీగా కలెక్షన్స్ రాబట్టింది

అటు హిందీ ప్రేక్షకులు సైతం వీరిద్దరి నటనకు.. కథకు ఫిదా అయ్యారనే చెప్పుకోవాలి

ఇటీవల విడుదలైన 18 పేజిస్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది

వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న ఈ కేరళ కుట్టి ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచినట్లుగా తెలుస్తోంది

ఇక ఇప్పుడు వరుస హిట్స్ అందుకోవడం..పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ రావడంతో పారితోషికం పెంచేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది

తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం గతంలో ఒక్క చిత్రానికి రూ. 60 లక్షలు మాత్రమే తీసుకునే అనుపమ ప్రస్తుతం సినిమాకు రూ. 1.20 కోట్లు డిమాండ్ చేస్తుందట

అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది