వాస్తవానికి డైట్ సాఫ్ట్‌ డ్రింక్‌ ఆరోగ్యానికి మంచిదేనా..? అని ప్రశ్నిస్తే ఎవ్వరి దగ్గర సరైన సమాధానం ఉండదు

సాఫ్ట్‌ డ్రింక్‌ అనుకున్నంత మంచిదేం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

కోక్, ఇతర కూల్‌డ్రింక్స్‌, సోడాల్లో చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి

చక్కెర లేదా కేలరీలు లేని సోడాగా ప్రచారం అవుతున్న డైట్ కోక్‌ని చాలామంది ఇష్టంతో తాగుతారు

మీరు కూడా డైట్ కోక్ తెగ తాగుతుంటే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి

రోజులో రెండు కంటే ఎక్కువ డైట్ కోక్ లను తాగితే మీ మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది

దంతాలు పుచ్చిపోవడం, నొప్పి వంటివి వచ్చే అవకాశముంది

డైట్ కోక్ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి

 దాహం వేసినప్పుడు.. డైట్ కోక్ బదులు నీరు లేదా హెర్బల్ టీ లాంటివి తాగడం మంచిదని సూచిస్తున్నారు