పొట్టి ఫార్మాట్‌లో హార్దిక్ పాండ్యా మరో మైలురాయి.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డ్..

టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత నుంచి హార్దిక్ 3 సార్లు సారథిగా వ్యవహరించాడు

ఇందులో భారత జట్టు మూడింటిలో విజయం సాధించింది.

హార్దిక్ కూడా బ్యాట్, బాల్ రెండింటితోనూ అద్భుత ప్రదర్శనతో జట్టు విజయానికి కీలకంగా మారాడు.

న్యూజిలాండ్‌తో ముగిసిన సిరీస్‌లో హార్దిక్‌కి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ టైటిల్ లభించింది.

ఈ సిరీస్‌లో హార్దిక్ బ్యాట్‌తో 66 పరుగులు చేయగా, బంతితో మొత్తం 5 వికెట్లు తీశాడు.

దీంతో హార్దిక్ పాండ్యా పేరుపై మరో రికార్డు చేరింది.

టీ20 ఫార్మాట్‌లో 4000 కంటే ఎక్కువ పరుగులు, 100 వికెట్లకు పైగా సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత నుంచి హార్దిక్ 3 సార్లు సారథిగా వ్యవహరించి, 3 సిరీస్ లు అందుకున్నాడు.