వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కంగనా రనౌత్‌

ఈ అమ్మడు తాజాగా నటిస్తున్నసినిమా చంద్రముఖి-2

రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది

2005లో రజినీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో కనిపించిన చంద్రముఖి సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే

ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరెకక్కుతున్న చంద్రముఖి-2లో  కంగనా  చంద్రముఖిగా కనిపించనుంది

ఈ క్రమంలో నటి జ్యోతికపై కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

గతంలో ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ.. కంగనా నా ఫేవరెట్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ అని తెలిపింది

ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియోపై కంగనా స్పందిస్తూ.. "చంద్రముఖిలో జ్యోతిక ఐకానిక్‌ నటనను నేను దాదాపు ప్రతిరోజూ చూస్తున్నాను

ఎందుకంటే మేము క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నాము. జ్యోతిక నటన అద్భుతం. ఆమెను మ్యాచ్‌చేయడం చాలా కష్టం" అని ఆమె ప్రశంసలు కురిపించింది