బాలీవుడ్ సినిమాల ట్రెండ్ మార్చిన బాద్షా అతను. ఒక్కో అవకాశాన్ని.. ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ..నంబర్ వన్ పొజిషన్ కు చేరిన.. కింగ్ ఆఫ్ బాలీవుడ్.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిన కింగ్ ఖాన్. తన ఇంటిపేరునే కింగ్ గా మార్చుకున్న షారుఖ్ ఖాన్
1965 నవంబర్ 2 న ఢిల్లీలోని పఠాన్ ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు షారుఖ్. అతని తండ్రి తాజ్ మహమ్మద్ ఖాన్, తల్లి లతీఫ్ ఫాతిమా
కొన్ని టీవీ సీరియళ్లతో యాక్టింగ్ స్టార్ట్ చేసిన షారుఖ్.. బాలీవుడ్ సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగారు.
షారుఖ్ ఖాన్... ఈ పేరు కంటే బాలీవుడ్ బాద్ షా,కింగ్ ఖాన్,, కింగ్ ఆఫ్ బాలీవుడ్, కింగ్ ఆఫ్ రొమాన్స్..అంటేనే ఇపుడు ఎక్కువ పాపులర్.
అతనికి ఫస్ట్ చాన్స్ ఇచ్చింది మాత్రం హేమామాలిని. ఆమె డైరెక్షన్ చేసిన దిల్ ఆశ్నా హై.. సినిమా.. కొన్ని కారణాలు వల్ల రిలీజ్ లేటయింది.
సెకండ్ చాన్స్ గా ‘దీవానా’ లో ఆఫర్ వచ్చింది. రిషికపూర్, దివ్యభారతిలతో పాటు సపోర్టింగ్ రోల్ అది. ఆ సినిమాతోనే లైఫ్ టర్న్ అయింది
ఆ సినిమాలో అతని యాక్టింగ్ కు బెస్ట్ మేల్ డెబ్యూ యాక్టర్ ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. అలా బాలీవుడ్లో అతని ప్రస్థానం మొదలైంది.
ఢిల్లీలో ఉండగానే గౌరీని ప్రేమించాడు. 1991 లో గౌరిని పెళ్లి చేసుకున్నాడు షారుఖ్
1994 లో వచ్చిన అంజాం సినిమాలోనూ నెగెటివ్ క్యారెక్టర్ చేసాడు షారుఖ్. నెగెటివ్ క్యారెక్టర్లకు కొత్త డెఫినేషన్ ఇచ్చిన నటుడు షారుఖ్.