బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన హీరోయిన్ హన్సిక మోత్వాని.
తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ సోగ కళ్ల సుందరి.
త్వరలో హన్సిక పెళ్లి చేసుకోనున్నదనే టాక్ వినిపిస్తోంది.
టీవీ సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక మోత్వాని పెళ్లికి సిద్ధమైంది.
ఈ ఏడాది డిసెంబర్‌లో జైపూర్ కోటలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.
ఇప్పటికే ఈ మేరకు రాయల్ వెడ్డింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.
450 ఏళ్ల నాటి కోట, ప్యాలెస్ వేదికగా హన్సిక వివాహ వేడుక పాతకాలపు టచ్‌తో రాయల్‌గా ఉంటుందని భావిస్తున్నారు.