'కోయ్ మిల్ గయా' హిందీ మువీతో బాలనటిగా సినీ కెరీర్ ప్రారంభించిన నటి హన్సిక
సినిమా ఆఫర్లు క్యూ కట్టడంతో త్వరగా ఎదిగేందుకు హన్సిక తల్లి హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిందట
సాధారణంగా హీరోయిన్స్ అందంగా కనిపించేందుకు ఏదోఒక ఇంజక్షన్ లేదా సర్జరీనో చేయించుకుంటారనే విమర్శలు వస్తుంటాయి
ఈ క్రమంలో హన్సిక కూడా ఇలాంటి ఇంజక్షన్స్ ఏదో తీసుకునే ఉంటుందని ఆమధ్య కొన్ని పుకార్లు షికార్లు చేశాయి
హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న 'లవ్ షాదీ డ్రామా' షోలో ఈ పుకార్లపై ఆమె స్పందించారు
నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు త్వరగా పెరిగేందుకు ఇంజక్షన్స్ తీసుకున్నానని వార్తలు వండి వర్చారు
8 ఏళ్లకే నేను నటినయ్యానని మా అమ్మ నాకు హార్మోనల్ ఇంజక్షన్స్ ఇచ్చి త్వరగా పెరిగేలా చేసిందని రకరకాలుగా మాట్లారని హన్సిక బాధపడ్డారు