తలస్నానం చేశాక చాలామందికి జుట్టు ఆరబెట్టుకునేందుకు కూడా సమయం ఉండదు
కొందరైతే హెయిర్ డ్రైయర్‌ని ఉపయోగిస్తారు
అయితే ఈ పద్ధతి ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు సౌందర్య నిపుణులు
ఇదే కాదు జుట్టు తడిగా ఉన్నప్పుడు చేయకూడని పనులు చాలానే ఉన్నాయి
తడిగా ఉన్నప్పుడు జుట్టును దువ్వడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట
తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల జుట్టు చివర్లు చిట్లుతాయి
ఇలాంటి సమయాల్లో జుట్టును ముడివేసుకొంటే హెయిర్‌ఫాల్ అయ్యే అవకాశం ఉంది
తడి జుట్టు మీద ఎలాంటి స్టైలింగ్ చేయకూడదు. ఇలా చేయడం జుట్టు సమతుల్యం దెబ్బతింటుంది
మీ జుట్టును టవల్ తో మృదువుగా తుడుచుకొని, ఫ్యాన్ లేదా సహజమైన గాలికి ఆరబెట్టాలి
ఇలా చేస్తే జుట్టు రాలిపోయే సమస్యలు బాగా తగ్గుతాయి