శీతాకాలంలో ఉండే చల్లగాలుల వల్ల కేవలం శరీరంలోనే కాదు.. శిరోజాల్లో కూడా తేమ శాతం బాగా తగ్గిపోతుంది.

ఫలితంగా జుట్టంతా అట్టకట్టినట్లు పొడిగా తయారవుతుంది. అంతేకాకుండా కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలిపోయే సమస్య అధికమవుతుంది.

శీతాకాలంలో తలస్నానం మరీ ఎక్కువగా లేదా తక్కువగా కాకుండా వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

తలస్నానానికి ముందు జుట్టుకు కండిషనర్ తప్పకుండా అప్త్లె చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా ఉంటాయి.

తల స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి.

జుట్టుకు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే వస్తువులు కూడా వాడకపోవడం మంచిది. అంటే డ్రయర్స్, కర్లర్స్, స్ట్రయిటనర్స్.. మొదలైన వాటిని దూరంగా ఉంచాలి.

కండిషనర్ పెట్టుకున్న తర్వాత వేడి నీళ్లలో ముంచిన టవల్‌ను తలకు చుట్టుకున్నా కుదుళ్లకు మంచి పోషణ అంది బలం చేకూరుతుంది.

చలికాలంలో శిరోజాలకు ఎంత తరచుగా నూనె పెడితే అంత మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి బాగా ఉపకరిస్తుంది.