దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో గుంటూరు రైల్వే స్టేషన్‌ ఆవరణలో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.

వాడి పడేసిన పాత ఏసీ బోగీని గుంటూరు రైల్వే స్టేషన్‌ ఆవరణలో కోచ్‌ రెస్టారెంట్‌ పేరుతో ప్రారంభించారు.

 రైలు ప్రయాణికులకు వినూత్న అనుభవాన్ని అందించడానికి దక్షిణ మధ్య రైల్వే పలు చర్యలు చేపడుతోంది.

ఇందులో భాగంగా Guntur Railway Junctionలో గుంటూరు రైల్వే స్టేషన్ సర్క్యులేషన్ ప్రాంతంలో కోచ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు

ఈ హోటల్‌ను 24 గంటలు పని చేసే విధంగా తీర్చిదిద్దారు.

రైలు ప్రయాణికులతోపాటు ప్రజలకు కూడా 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా కోచ్‌ రెస్టారెంట్‌ ఇదే మొదటిది.