వెండితెర మీద సెంటిమెంట్లను చాలా సీరియస్‌గా ఫాలో అవుతుంటారు మేకర్స్‌.

ప్రజెంట్ అలాంటి ఓ ఇంట్రస్టింగ్ ట్రెండ్‌.. సిల్వర్ స్క్రీన్‌ను రూల్ చేస్తోంది.. థియేటర్లలో మోత మోగిస్తుంది.

హీరోయిజాన్ని మరింత ఎలివేట్‌ చేసే బిగ్ 'మెషీన్‌ గన్స్‌' బాక్సాఫీస్ దగ్గర సక్సెస్‌ మోత మోగిస్తున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో ఈ ట్రెండ్‌ను స్టార్ట్ చేసింది.

ఖైదీ సినిమా క్లైమాక్స్‌లో కార్తి వాడిన మెషీన్ గన్‌ ఆడియన్స్‌ను ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది.

కేజీఎఫ్ 2 సక్సెస్ విషయంలోనూ గన్‌ ఇంపాక్ట్ గట్టిగానే ఉంది. ఫస్ట్ టీజర్‌లోనే హీరోను భారీ గన్‌తో చూపించారు

విక్రమ్ మూవీలోనూ ఈ గన్‌ సౌండ్‌ గట్టిగానే రీసౌండ్ చేసింది. క్లైమాక్స్‌లో కమల్‌ గన్‌ పేల్చిన తీరు ఆడియన్స్‌ను కట్టిపడేసింది.

అఖిల్‌ ఏజెంట్‌లోనూ ఇలాంటి భారీ గన్‌ సీన్‌ ఒకటి ఉండబోతోంది. తాజాగా టీజర్‌ రిలీజ్ పోస్టర్‌లో భారీ మెషీన్‌ గన్‌తో కనిపించారు అఖిల్‌.